బీజీపీతో ఎప్పుడూ కలవం

తమ ఎమ్మెల్యేలు తమకు ఉన్నారని, పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారన్నారు. [more]

Update: 2019-11-23 07:33 GMT

తమ ఎమ్మెల్యేలు తమకు ఉన్నారని, పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారన్నారు. తమ కూటమికి 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని శరద్ పవార్ తెలిపారు. ఈరోజు ఉదయమే పరిస్థితి మారిందన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఇప్పటికీ ఉందని శరద్ పవార్ తెలిపారు. తమకు కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. నాకు తెలియకుండానే అజిత్ పవార్ రాజ్ భవన్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారన్నారు.

అంత బలం లేదు…..

బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదని శరద్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ నిర్ణయం పార్టీకి పూర్తి విరుద్ధమని తెలిపారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని శరద్ పవార్ చెప్పారు. ఎన్సీపీ ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపదన్నారు. అజిత్ పవార్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అజిత్ పవార్ పార్టీ క్రమశిక్షణ తప్పాడని గుర్తించామని, అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అజిత్ పవార్ తో ఉన్న ఎమ్మెల్యేలందరూ తమతో టచ్ లో ఉన్నారని శరద్ పవార్ చెప్పారు. అజిత్ వర్గంపై అనర్హత వేటు తప్పదని శరద్ పవార్ హెచ్చరించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు

Tags:    

Similar News