ఎంపీ ఫేస్ బుక్ అకౌంట్ ను?

టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఫేస్ బుక్ అకౌంట్ ని నకిలీది సైబర్ నేరగాళ్లు తయారుచేశారు . ఒరిజినల్ అకౌంట్ మాదిరిగానే నకిలీ ది అకౌంట్ ని [more]

Update: 2021-04-21 01:39 GMT

టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఫేస్ బుక్ అకౌంట్ ని నకిలీది సైబర్ నేరగాళ్లు తయారుచేశారు . ఒరిజినల్ అకౌంట్ మాదిరిగానే నకిలీ ది అకౌంట్ ని తయారుచేసి ఎంపీ మిత్రులకి పంపారు. ఇది గుర్తించిన ఎంపీ మిత్రులు వెంటనే సంతోష్ ను అప్రమత్తం చేశారు. దీంతో తన ఫేస్ బుక్ నకిలీ తయారు చేసిన వారిపై వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ సంతోష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలం నుంచి కూడా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు . ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ తయారు చేసి వాళ్ల మిత్రులు పంపించి వాళ్ల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యం పేరు చెప్పి సదర్ ఖాతాదారుని మిత్రులు బంధువులు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఇలాంటి మోసాలకు భరత్ పూర్ గాంగ్ పాల్పడుతోంది. ఇప్పటికే చాలా గాంగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా రోజుకు ఒక పూట ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఎంపీ ఫేప్ బుక్ అకౌంట్ ని నకిలీ తయారుచేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News