అక్కడి లేని సమస్య ఇక్కడెందుకో?

జాతీయ విపత్తుగా కరోనా ను పరిగణించిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం మానవతా థృక్ఫధంతో వ్యవహరించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపడంపై [more]

Update: 2021-05-15 01:16 GMT

జాతీయ విపత్తుగా కరోనా ను పరిగణించిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం మానవతా థృక్ఫధంతో వ్యవహరించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపడంపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను రూపొందించిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వారి సమస్యలను కూడా తాము గుర్తించామన్నారు. ఏపీ నుంచి ఒక్కసారిగా ప్రజలు వైద్యానికి అక్కడకు వెళితే హైదరాబాద్ లో పడకల కొరత ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఉంటుందని చెప్పారు. అయినా ప్రాణానికి ప్రాంతం, వ్యక్తులతో సంబంధం లేదని, మానవీయ కోణంలో ఆలోచించి అంబులెన్స్ లకు అనుమతించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. అనుమతులు అప్పటికప్పుడు పొందడం సాధ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ నుంచి వైద్యం కోసం బెంగళూరు, చెన్నై కి వెళుతున్నారన్నారు. అక్కడి రాని సమస్య ఇక్కడ ఎందుకో అర్థం కావడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Tags:    

Similar News