ఓటమిని అంగీకరించలేకే అడ్డదారులు

ఓటమిని అంగీకరించలేకనే చంద్రబాబు అడ్డదారులు వెతుక్కుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచారన్నారు. నాలుగు [more]

Update: 2021-02-22 01:23 GMT

ఓటమిని అంగీకరించలేకనే చంద్రబాబు అడ్డదారులు వెతుక్కుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచారన్నారు. నాలుగు పంచాయతీలు గెలిచి కొందరు చొక్కాలు చింపుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతి పంచాయతీని చంద్రబాబు ఒక అసెంబ్లీ ఎన్నిక స్థాయిలో చిత్రీకరించారన్నారు. దౌర్జన్యాలు చేస్తున్నామన్న తమపై చేస్తున్న ఆరోపణలు సరికాదని ఫలితాల ద్వారా తేలిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడమే ఇందుకు ఉదాహరణ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News