వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.. టీడీపీది తప్పుడు ప్రచారం

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి 81 శాతం ఓట్లు వచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. వైసీపీ [more]

Update: 2021-02-10 09:05 GMT

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి 81 శాతం ఓట్లు వచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. వైసీపీ మద్దతుదారులు ఈ ఎన్నికల్లో భారీగా గెలిచారన్నారు. కానీ చంద్రబాబు అబద్దపు మాటలు చెప్పి పార్టీని ఇంకా నడిపిద్దామనుకుంటున్నారు. ఎల్లో మీడియాలో టీడీపీకే ఎక్కువ స్థానాలు వచ్చినట్లు ప్రజలను మాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చారన్నారు. తప్పుడు లెక్కలతో చంద్రబాబు తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు. పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. అమరావతి ప్రాంతంలోనూ వైసీపీ మద్దతుదారులే జెండా ఎగురవేశారన్నారు. కాలరెగరేసిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ నియోజకవర్గాలైన టెక్కలి, మైలవరం నియోజకవర్గాల్లో 95 శాతం పంచాయతీలు వైసీపీ గెలుచుకుందన్నారు.

Tags:    

Similar News