వెనక్కు తగ్గిన ఆర్టీసీ జేఏసీ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గారు. ఆర్టీసీ జేఏసీ కొద్దిసేపటి క్రితం సమావేశమై ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమన్న డిమాండ్ ను కొంత కాలం వెనక్కు తీసుకుంటున్నామని [more]

Update: 2019-11-14 14:20 GMT

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గారు. ఆర్టీసీ జేఏసీ కొద్దిసేపటి క్రితం సమావేశమై ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమన్న డిమాండ్ ను కొంత కాలం వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు. విలీనం డిమాండ్ ను తాత్కాలికంగానే వాయిదా వేశామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రయివేకరిస్తే బడుగు, బలహీన వర్గాల వారు ఎక్కువగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీ సమ్మె మాత్రం కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీన సడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలతో రెండు, మూడురోజుల్లో గవర్నర్ ను కలుస్తామని చెప్పారు.

Tags:    

Similar News