జేఏసీ ఏం చేయబోతోంది?

ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం ఎవరూ తగ్గడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వార్నింగ్ కార్మిక లోకానికి పంపారు. [more]

Update: 2019-11-03 04:54 GMT

ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం ఎవరూ తగ్గడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వార్నింగ్ కార్మిక లోకానికి పంపారు. నవంబరు 5వ తేదీలోపు కార్మికులు విధుల్లో చేరకుంటే అన్ని రూట్లను ప్రయివేటు పరం చేస్తానని హెచ్చరించారు. నెలరోజుల్లో సమ్మెపై పురోగతి లేదు. చర్చలు లేవు. సంప్రదింపులు లేవు. విపక్షాల మద్దతు ఇవ్వడంతో కేసీఆర్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 5,100 ప్రయివేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News