ఉద్యోగసంఘాల మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆరు రోజులుగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. కాసేపటి క్రితం విపక్షాలు, ప్రజా [more]

Update: 2019-10-10 12:00 GMT

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆరు రోజులుగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. కాసేపటి క్రితం విపక్షాలు, ప్రజా సంఘాలతో ఆర్టీసీ జేఏసీ భేటీ అయ్యింది. సమ్మె పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికపై చర్చించింది. 19న తలపెట్టనున్న తెలంగాణ బంద్ కు, బహిరంగ సభకు , ఉద్యోగ సంఘాల మద్దతును ఆర్టీసీ జేఏసీ కోరింది. రేపు అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలివ్వాలని నిర్ణయించింది. ఎల్లుండి ఉదయం గాంధీ, జయశంకర్ విగ్రహాల ముందు మౌనదీక్షలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.

 

Tags:    

Similar News