నియామకం..కలవరం

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పిన కేసీఆర్ సర్కార్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీలో కొత్త నియామకాల ప్రక్రియను కొద్దిసేపటి క్రితమే చేపట్టింది. [more]

Update: 2019-10-07 04:52 GMT

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పిన కేసీఆర్ సర్కార్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీలో కొత్త నియామకాల ప్రక్రియను కొద్దిసేపటి క్రితమే చేపట్టింది. వేల సంఖ్యలో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిపోల వద్ద హాజరయ్యారు. వారి డ్రైవింగ్ లైసెన్సులు, అనుభవం పరిశీలించిన అనంతరం నియామకాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు ప్రభుత్వం నో చెప్పింది. ఇందిరా పార్కు వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్టీసీ డిపోల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విధులకు హాజరు కాని ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో కొత్త నియామకాలు ఆర్టీసీ కార్మికులను కలవరపెడుతున్నాయి.

Tags:    

Similar News