గాంధీ ఆసుపత్రికి రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గతంలో ఓ కేసు విషయంలో పోలీసులు టీవీ9 స్టుడియోకు [more]

Update: 2019-10-05 14:08 GMT

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గతంలో ఓ కేసు విషయంలో పోలీసులు టీవీ9 స్టుడియోకు రాగా వారి విధులకు రవిప్రకాష్ ఆటంకం కల్పించారనే అభియోగంపై ఇవ్వాళ ఉదయం బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పలుమార్లు విచారించిన పోలీసులు చివరికి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశాలున్నాయి. గత నెల 4న అలందా మీడియా సంస్థ రవిప్రకాష్ పై ఫిర్యాదు చేసింది. రూ.18 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్, టీవీ 9 లోగోను విక్రయించారనే అభియోగాలు రవిప్రకాష్ పై ఉన్నాయి.

 

Tags:    

Similar News