రంజన్ గొగోయ్ గురించి తెలుసా..?

Update: 2018-10-03 10:07 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగియడంతో రంజన్ గొగోయ్ ఈ పదవిని చేపట్టారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రభుత్వ పెద్ద, రాజకీయా ముఖ్యులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. జస్టిస్ రంజన్ గొగోయ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు...

- 1954 నవంబర్ 18న అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో గొగోయ్ జన్మించారు.

- ఆయన తండ్రి కేశవ్ చంద్ర గొగోయ్ 1982లో అసోం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

- ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తిగా రంజన్ గొగోయ్ చరిత్ర సృష్టించారు.

- ఆయన ఇంతకుముందు హర్యానా, గౌహతి హైకోర్టుల చీఫ్ జస్టిస్ గా కూడా పనిచేశారు.

- దేశచిరిత్రలోనే తొలిసారిగా కేసుల కేటాయింపుపై మీడియా ముందుకువచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాదుల్లో రంజన్ గొగోయ్ కూడా ఒకరు.

- రంజన్ గొగోయ్ పేరుపై కనీసం స్వంత ఇల్లు, వాహనం కూడా లేదు.

- ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2019 నవంబరు 17వ తేదీ వరకు కొనసాగనున్నారు.

- ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తన తల్లికి పాదాభివందనం చేశారు.

Similar News