సంచలన విషయాలు బయటపెట్టిన రమణ దీక్షితులు

Update: 2018-06-04 16:50 GMT

తిరుపతి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారికి సంబంధించిన ఆభరణాలు నేలమాలిగల్లో ఉన్నాయని, ఈ విషయం బ్రిటీష్ వారి మాన్యువల్ లో కూడా ఉందని తెలిపారు. ప్రతాపరుద్రుడు స్వామివారికి బహుకరించిన విలువైన నగలు నేలమాలిగల్లో ఉన్నాయని, వాటి కోసం తవ్వకాలు జరిగాయని స్పష్టం చేశారు. తనకు ఆస్తులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. గతంలో జేఈఓలుగా ఉన్నబాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాస రాజులు ఆలయంలో అర్చకులను అనేక ఇబ్బందులు పెట్టారని, అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. తనపై రెండుసార్లు హత్యాయత్నం కూడా జరిగిందని, వారసత్వంగా వచ్చిన ఇంటిని కక్షపూరితంగా కూల్చివేశారని ఆరోపించారు. తాను పుట్టిందే శ్రీవారికి సేవ చేయడానికని, తనకు తనకు అపాయింట్ ఆర్డర్, రిటైర్మెంట్, ప్రమోషన్లు వంటివి ఏమీ ఉండవని, ఎప్పటికీ శ్రీవారి సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు.

Similar News