బ్రేకింగ్ :రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్

Update: 2018-04-04 08:48 GMT

రాజ్యసభలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నిలదీశారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమయిందని ఆజాద్ ఆరోపించారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీలు వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సయితం ప్లకార్డుతో పోడియం ముందు నిలబడ్డారు. అన్నాడీఎంకే సభ్యులు కూడా కావేరీ జలాలపై ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. తమ స్థానాల్లో కూర్చుంటే చర్చిద్దామని చెప్పినా సభ్యులు శాంతించలేదు. దీంతో రాజ్యసభ అరగంటపాటు వాయిదా వేశారు.

Similar News