బ్రేకింగ్ : గట్టెక్కించారు

ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభ లో ఓటింగ్ జరిగింది. స్లిప్పుల ద్వారా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఓటింగ్ ను నిర్వహించారు. సుదీర్ఘ చర్చ అనంతరం ట్రిపుల్ తలాక్ [more]

Update: 2019-07-30 13:12 GMT

ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభ లో ఓటింగ్ జరిగింది. స్లిప్పుల ద్వారా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఓటింగ్ ను నిర్వహించారు. సుదీర్ఘ చర్చ అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లు పై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును నిరసిస్తూ జేడీయూ, వైఎస్సార్ కాంగ్రెస్ , టీఎంసీ, ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశాయి అన్నాడీఎంకే వాకౌట్ చేయగా, టీడీపీ, టీఆర్ఎస్, జేడీయూ సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 213కు చేరింది. బిల్లు గట్టెక్కాలంటే 107 మంది సభ్యుల మద్దతు అవసరం. బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన మద్దతు అధికార ఎన్డీఏకు దక్కింది. ట్రిపుల్ తలాక్ పై విపక్షాలు ఇచ్చిన సవరణలన్నీ వీగిపోయినట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల సవరణను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News