పొత్తులు..కుటుంబపాలనపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

Update: 2018-08-14 07:57 GMT

2019 ఎన్నికల్లో కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నను ఆయన కొట్టిపారేయలేదు. పొత్తులు స్థానిక పీసీసీలే నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. స్థానిక నేతల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీతో, బిహార్ లో ఆర్జేడీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని తేల్చారు. 120 లోక్ సభ స్థానాలు ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే మోడీ ప్రధాని అయ్యే సమస్యే ఉండదని పేర్కొన్నారు. ఇక కుటుంబపాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రాహుల్... కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదని, గత 20 ఏళ్లుగా నెహ్రూ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని కాలేదని గుర్తు చేశారు. ఇక సోనియా రిమోట్ తో మన్మోహన్ పనిచేశారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆర్ఎస్ఎస్ రిమోట్ తో మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు.

Similar News