ఎన్నికల ఫలితాలపై రాహుల్ స్పందన

Update: 2018-12-11 14:28 GMT

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు యువకులది, రైతులది, కాంగ్రెస్ కార్యకర్తలదని, ఈ గెలుపు ద్వారా తమ పార్టీపై మరింత బాధ్యత పెరిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ... తెలంగాణ, మిజోరంలో గెలిచిన పార్టీలకు ఆయన అభినందనలు తెలిపారు. ఓడిపోయిన ముఖ్యమంత్రులు ఇంతకాలం ప్రజల కోసం పనిచేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేశారన్నారు. బీజేపీ పాలనతో, పెద్దనోట్ల రద్దుతో, జీఎస్టీతో, నిరుద్యోగ సమస్యతో దేశంలో ప్రజలు సంతోషంగా లేమని స్పష్టమైన తీర్పును టీఆర్ఎస్ కి ఇచ్చారన్నారు. తెలంగాణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించామని, అయినా బాధలేదని ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ఈవీఎంలపై అనుమానాలు, ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయని, ఈవీఎంలలో ఉన్న చిప్ లను సులువుగా ట్యాంపర్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంల విషయమై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News