లాక్ డౌన్ పై తొలిసారి స్పందించిన రాహుల్

లాక్ డౌన్ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. లాక్ డౌన్ వల్ల కరోనా వ్యాప్తి ఆగిపోయిందని రాహుల్ అంగీకరించారు. అయితే లాక్ డౌన్ [more]

Update: 2020-04-16 08:00 GMT

లాక్ డౌన్ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. లాక్ డౌన్ వల్ల కరోనా వ్యాప్తి ఆగిపోయిందని రాహుల్ అంగీకరించారు. అయితే లాక్ డౌన్ అనంతరం ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే వ్యూహరచన చేయాలన్నారు. కరోనా పరీక్షలు పెద్దయెత్తున నిర్వహించాలని రాహుల్ కోరారు. కేవలం లాక్ డౌన్ మాత్రమే కరోనాను అరికట్టలేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్థిక సాయాన్ని అందించాలన్నారు. లాక్ డౌన్ తో దేశంలో ఎమెర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశమంతా ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందన్న రాహుల్ గాంధీ, పేదల ఆకలిని కూడా తీర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పరిపాలన యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. లాక్ డౌన్ కరోనాకు పాస్ బటన్ లాంటిందని రాహుల్ అన్నారు. లాక్ డౌన్ వల్ల సమస్య వాయిదా వేయగలిగామని, పరిష్కరించినట్లు కాదన్నారు. టెస్టింగ్ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలపాలని రాహుల్ గాంధీ కోరారు.

Tags:    

Similar News