టీఆర్ఎస్ కు ఓటేస్తే వారికి ఓటేసినట్లే..!

నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం వనపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ [more]

Update: 2019-04-01 09:57 GMT

నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం వనపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… టీఆర్ఎస్ కు వేసే ప్రతీ ఓటూ నరేంద్ర మోడీకి వేసినట్లే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు వేసే ప్రతీ ఓటూ నరేంద్ర మోడీని గద్దె దించడానికి వేసేదన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. తాము పార్లమెంటులో మోడీని నిలదీసేందుకు సిద్ధం కాగానే మోడీ సూచనలతో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేసి సభను వాయిదా వేయించే వారన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న నరేంద్ర మోడీని ఓడించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News