గురువులనే బొటన వేలు కోసివ్వమంటారు

Update: 2018-06-13 13:44 GMT

గురువు అడిగాడని ఏకలవ్యుడు చేతి బొటన వేలిని కోసిచ్చాడని, కానీ బీజేపీలో మాత్రం తమ గురువులనే బొటనవేలును అడిగే వ్యక్తులున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. వాజ్ పేయి, అద్వాణీ, జస్వంత్ సిన్హాలను మోదీ గౌరవించడం లేదని, భారత సంస్కృతిని కాపాడుతున్నానని చెబుతూ పెద్దలను కించపరుస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. అనంతరం గురుగ్రామ్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలోనూ మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన గురువు అద్వాణీనే మోదీ గౌరవించడం లేదన్నారు. మాకు, వాజ్ పేయికి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఆయనను పరామర్శించడం మన సంప్రదాయమన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశం కోసం ఎంతో శ్రమించారని గుర్తుచేశారు.

Similar News