బ్రేకింగ్ : ఈబీసీలకు శుభవార్త

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీపీ)కు శుభవార్త. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు [more]

Update: 2019-01-12 13:13 GMT

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీపీ)కు శుభవార్త. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇక, ఇప్పటి నుంచి ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఎవరూ ఊహంచని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టిన సంగతి తెలిసింది. సమావేశాల గడువు పొడిగించి మరీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్రకు వెళ్లింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడటంతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా రానున్నాయి.

Tags:    

Similar News