రగ్బీ ఆట కోసం పోలీస్ నేరగాడుగా మారి?

అతను ఒక పోలీస్.. నేరస్తుడిని పట్టుకోవలసిన ఈ పోలీస్ దొంగ గా మారాడు. దొంగలకు దొంగ గా మారి ఏకంగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన తీరు [more]

Update: 2020-02-19 11:15 GMT

అతను ఒక పోలీస్.. నేరస్తుడిని పట్టుకోవలసిన ఈ పోలీస్ దొంగ గా మారాడు. దొంగలకు దొంగ గా మారి ఏకంగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన తీరు ఇది. పోలీసు దొంగగా మారడానికి గల కారణాలను ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే అతడు చెప్పిన కారణమని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రగ్బీ అంటే ఈ పోలీస్ కి చాలా ప్రేమ. అంతే కాకుండా ఖాళీ సమయం దొరికితే టీమ్ తయారు చేసి రెడీ రగ్బీ ఆడుతుంటాడు . అయితే ఒక టీమ్ ని తయారు చేయాలని అనుకున్నాడు . ఇందు కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉన్నాయి . అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో రగ్బీ టీంను తయారు చేయాలని ప్లాన్ చేశాడు.

దొంగతనాలు అలవాటుగా…

రైళ్ళలో వరుస దొంగతనాలు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపించిన మహరాష్ట్ర కి చెందిన ఓ హోంగార్డు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి ఆరు లక్షల విలువ చేసే సొత్తును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రైల్వే ఎస్పీ అనురాధ పూర్తి వివరాలను వెల్లడించారు. ఇతని పేరు మోహన్ దేవ్ రావ్ చవన్. మహరాష్ట్ర లోని నాందేడ్ జిల్లా, కర్లా తండా కి చెందిన మోహన్ గత కొన్నేళ్ళుగా మహారాష్ట్ర పోలీసు శాఖలో హోంగార్డు గా పనిచేస్తున్నాడు. ఇతనికి రగ్బీ అట ఆడే అలవాటు ఉండటంతో ..ఒక జట్టు తయారు చేద్దామని అనుకున్నాడు.. అతని సొంత డబ్బుతో యువకులకు రగ్బీ బంతులు కూడా కొనిచ్చే వాడు. ఇంత వరకూ బాగానే ఉంది. వీరి కోసం ఖర్చు చేసేందుకు చివరకు రైళ్ళలో దొంగతనాలు మొదలు పెట్టాడు. ఈ దశలో ఉద్యోగానికి వెళ్ళకుండా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ప్రదీప్ అనే మరో వ్యక్తి తో కలిసి చోరీలకు పాల్పడే వాడు. కానీ అన్ని రైళ్ళలో కాదు..కేవలం నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్ ప్రెస్ లో మాత్రమే చోరీలు చేసేవాడు. గత రాత్రి బాసరలో రెక్కీ చేస్తున్న ఇద్దరు నిందితులను నిజామాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 116 గ్రాముల బంగారం, 1.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News