సింగర్ సునీత పేరుతో వసూళ్లు…యువకుడి అరెస్ట్

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సునీత పేరుతో పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం [more]

Update: 2020-08-08 08:23 GMT

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సునీత పేరుతో పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు . ఈ మేరకు సునీత ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అనంతపూర్ కు చెందిన చైతన్య ను అరెస్టు చేశారు. ప్రముఖ గాయని సునీత పేరు ఉపయోగించుకొని డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన చైతన్య అనే యువకుడు సునీత అభిమానిగా చెప్పుకొంటూ సామాజిక మాధ్యమాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె పేరుపై స్వచ్ఛంద సేవ చేస్తానంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. సునీత పేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సైతం తెరిచాడు. ఈ విషయంపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అనంతపురంలోనూ కేసులున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News