బయట కాలు పెడితే మూడు నిమిషాల్లోనే?

విదేశాల నుంచి వచ్చిన వారిపై పోలీసులు నిఘా పెడుతున్నారు . ఇందులో భాగంగా స్వీయ నియంత్రణ లో ఉండాల్సిన వారు బయట తిరిగి తిరుగుతుండడంతో పోలీస్ శాఖ [more]

Update: 2020-03-28 07:09 GMT

విదేశాల నుంచి వచ్చిన వారిపై పోలీసులు నిఘా పెడుతున్నారు . ఇందులో భాగంగా స్వీయ నియంత్రణ లో ఉండాల్సిన వారు బయట తిరిగి తిరుగుతుండడంతో పోలీస్ శాఖ తీవ్ర ఆగ్రహంతో ఉంది . ఇందుకు సంబంధించి విదేశాల నుంచి వచ్చిన వారిపై జియో ట్యాగింగ్ ద్వారా నిఘా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సొంత యాప్ ద్వారా హౌస్ క్వారంటైన్ లో ఉన్న వారిపై నిఘా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో 11 వేల మంది పై తెలంగాణలో 22 వేల మంది పైన పోలీస్ అధికారులు నిఘా పెట్టారు. హౌస్ క్వారంటైన్ ఉన్న వాళ్లంతా కూడా బయట తిరుగుతుండటంతో కాంటాక్ట్ తో కరోనా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో…..

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 33 వేల మంది విదేశాల నుంచి వచ్చారు వీరిలో కొంతమంది కనిపించకుండా పోయారు ఎవరినైతే గుర్తించారో వాళ్ళని జియో ట్రాక్ చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి తన ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం వెళుతుంది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుంటారు. హౌస్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే ప్రభుత్వ హౌస్ క్వారంటైన్ కు పంపించి వేస్తారు. అయితే ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో కూడా ఇది ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. హౌస్ క్వారంటైన్ ఉల్లంఘించిన ఒక వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి ప్రభుత్వ హౌస్ క్వారంటైన్ కు పంపించి వేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి తోనే కరోనా వైరస్ సోకుతుండటంతో వాళ్లకే జియో ట్యాగింగ్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మొత్తం 33 వేల మంది పైన మందికి జియో ట్యాగింగ్ చేశారు పోలీసు అధికారులు. జియో టాగ్ చేయబడిన వ్యక్తులు ఎవరైనా ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే స్థానిక పోలీసులతో పాటు కంట్రోల్ రూమ్ కు సమాచారం వెళుతుంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు మూడు నుంచి ఐదు నిమిషాల లోపల సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని వెంటనే ప్రభుత్వం హౌస్ క్వారంటైన్ కు తరలిస్తారు. ఆధునిక టెక్నాలజీతో, సాంకేతిక నిపుణులైన అధికారుల బృందం తో తెలంగాణ, ఆంధ్ర పోలీసులు ముందంజలో ఉన్నారు.

Tags:    

Similar News