తాను సభ్యుడినైనా పరవాలేదు

రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం శాసనమండలి రద్దు సరైనదేనని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తాను మండలి సభ్యుడిని అయినా ఆనందంగా రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని [more]

Update: 2020-01-27 11:09 GMT

రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం శాసనమండలి రద్దు సరైనదేనని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తాను మండలి సభ్యుడిని అయినా ఆనందంగా రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. శాసనమండలిలో ఇటీవల నిబంధనలకు వ్యతిరేకంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని పిల్లి సుభాష్ తెలిపారు. క్రికెట్ లో నో బాల్ వేస్తే ఎంపైర్ గుర్తించకపోతే థర్డ్ ఎంపైర్ ను అడుగుతారన్నారు. అయితే థర్డ్ ఎంపైర్ నిర్ణయమే ఫైనల్ అని, మండలిలోనూ సభాపతి నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ బాలు వేయకుండానే డెసిషన్ ప్రకటించారన్నారు. సమగ్రాభివృద్ధి జరగాలంటే వీకేంద్రీకరించాల్సిందేనని చెప్పారు. ఒక ముఖ్యమైన చట్టం విషయంలో తాము తప్పు చేశామంటూనే రూలింగ్ ఇవ్వడం క్షమించరాని నేరమని పిల్లి తెలిపారు. శాసనమండలి వల్ల ప్రయోజనాలు ఏవీ లేవన్నారు. ప్రజలకు నష్టం కల్గించే విషయంలో జగన్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని చెప్పారు.

Tags:    

Similar News