కాంగ్రెస్ లో ఆడియో టేపుల కలకలం

Update: 2018-11-15 10:06 GMT

కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ యాదవ, కుర్మ సామాజకవర్గానికి చెందిన నేతలు గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్త చరణ్ దాస్ ఒక్కో టిక్కెట్ కోసం రూ.3 కోట్లు డిమాండ్ చేశారని క్యామ మల్లేష్ ఆరోపించారు. ఈ మేరకు భక్త చరణ్ దాస్ కుమారుడు సాగర్ తో ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపులు విడుదల చేశారు.

బీసీలకు అన్యాయం చేశారంటూ.....

17వ తేదీన ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయనున్నట్లు శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు బీసీల గొంతు కోసిండని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ద్రోహం చేస్తున్నారన్నారు.

Similar News