నిమ్మగడ్డ చెప్పినట్లు వింటే. బ్లాక్ లిస్ట్ లో పెడతాం

అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినట్లు ఫలితాలను నిలిపివేస్తే గుర్తు పెట్టుకుని మరీ చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. చిత్తూరు, [more]

Update: 2021-02-05 12:52 GMT

అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినట్లు ఫలితాలను నిలిపివేస్తే గుర్తు పెట్టుకుని మరీ చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీమైన పంచాయతీల ఫలితాలను నిలిపేయాలని నిమ్మగడ్డ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ మార్చి 31వ తేదీ వరకే ఎస్ఈసీ ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. ఒకసారి ఏకగ్రీవమని ప్రకటిస్తే ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వరని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ చెప్పినట్లు ఆడితే తాము అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News