రఘురామకు ఆ దమ్ముందా… పెద్దిరెడ్డి సవాల్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని కోరారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని [more]

Update: 2021-03-12 01:02 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని కోరారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తిని జగన్ ఎంపీని చేశారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి పనిచేస్తున్న ఘనత రఘురామ కృష్ణంరాజుది అని అన్నారు. సీఎల్పీ మీటింగ్ కు రఘురామకృష్ణంరాజు హాజరు కావాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఓ బ్లాక్ షీప్ అని కొట్టిపారేశారు. తన గురించి మరొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News