జేడీ రాజీనామాపై పవన్

వి.వి.లక్ష్మీనారాయణ మనోభావాలను గౌరవిస్తున్నానని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నానని జనసేనఅధినేత పవన్ కల్యాణ‌ తెలిపారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ [more]

Update: 2020-01-31 01:30 GMT

వి.వి.లక్ష్మీనారాయణ మనోభావాలను గౌరవిస్తున్నానని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నానని జనసేనఅధినేత పవన్ కల్యాణ‌ తెలిపారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని, అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినితాను కానని తెలిపారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని, తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు. వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం తనకు సినిమాలు చేయడం తప్పనిసరి అని చెప్పారు. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని పవన్ కల్యాణ్ రెస్పాండ్ అయ్యారు.

Tags:    

Similar News