నాలుగు వారాలు పవన్ షెడ్యూల్ ఇదే

బీజేపీ, జనసేన పొత్తు ఖరారవ్వడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ నెలాఖరు నుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పవన్ కల్యాణ్ [more]

Update: 2020-01-17 12:34 GMT

బీజేపీ, జనసేన పొత్తు ఖరారవ్వడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ నెలాఖరు నుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మొత్తం నాలుగు వారాల పాటు పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారయింది. నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన అభ్యర్థులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీజేపీతో పొత్తు వంటి అంశాలను చర్చించనున్నారు. ఇలా వరస సమావేశాలతో పవన్ కల్యాణ్ బిజీ కానున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైనే పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు.

Tags:    

Similar News