పవన్ మద్దతు జగన్ కేనా?

Update: 2018-06-22 07:45 GMT

వైసీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో పవన్ మద్దతు తమకే నని వరప్రసాద్ చెప్పారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ తనతో చెప్పారని వరప్రసాద్ తెలిపారు. 2014 ఎన్నికల్లో ఆయన అనుభవం చూసి మద్దతు తెలిపానని, అయితే అనుభవం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కష్టజీవి జగన్ కే వచ్చే ఎన్నికల్లో తన మద్దతని పవన్ తనతో అన్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గతంలోనూ వరప్రసాద్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అయితే జనసేన నుంచి ఎటువంటి ఖండనలు రాకపోవడం విశేషం.

Similar News