పిల్లల జీవితాలతో చెలగాటామా..?

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో లోపాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఇంటర్ బోర్డు తప్పుల వల్ల పిల్లలను ఫెయిల్ చేశారని ఆరోపిస్తూ ఇవాళ [more]

Update: 2019-04-22 07:17 GMT

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో లోపాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఇంటర్ బోర్డు తప్పుల వల్ల పిల్లలను ఫెయిల్ చేశారని ఆరోపిస్తూ ఇవాళ ఇంటర్ బోర్డు వద్ద విద్యర్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తాము కష్టపడి ఫీజులు కట్టి చదివిస్తే పిల్లలు సంవత్సరం మొత్తం చదివి పరీక్షలు రాస్తే ఫలితాల్లో తప్పులతో ఎలా ఫెయల్ చేస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతోందన్నారు. రీవాల్యువేషన్ కోసం దరఖాస్తు చేయడానికి వెబ్ సైట్ కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అసలు రాష్ట్రానికి వారు ఉన్నారా లేరా అని అడుగుతున్నారు. ఇక, ఇంటర్ బోర్డు కార్యదర్శి రాజీనామా చేయాలని, రీవాల్యువేషన్ ఉచితం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల పక్షాన ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ ఇంటర్ బోర్డు ముందు ధర్నాకు దిగాయి.

Tags:    

Similar News