అక్బర్ పై దాడి చేసిన పహిల్వాన్ మృతి

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై దాడి చేసిన పహిల్వాన్ మృతి చెందాడు. గుండెపోటుతో ఇవాళ ఉదయం యశోద హాస్పిటల్ లో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎనిమిది సంవత్సరాల [more]

Update: 2020-02-11 05:06 GMT

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై దాడి చేసిన పహిల్వాన్ మృతి చెందాడు. గుండెపోటుతో ఇవాళ ఉదయం యశోద హాస్పిటల్ లో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎనిమిది సంవత్సరాల క్రితం మహమ్మద్ పహిల్వాన్ ఎంఐఎ: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పై దాడి చేశాడు. కత్తులతో దాడి చేసిన ఈ ఘటనలో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు. దాదాపు మూడేళ్ల పాటు చికిత్స పొందిన తర్వాత పూర్తిస్థాయిలో అక్బరుద్దీన్ ఓవైసీ కోలుకున్నాడు. అయితే అరెస్ట్ అయిన మొహమ్మద్ పహిల్వాన్ చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ ఇవ్వకపోవడం తో సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు చివరకు బెయిల్ ఇవ్వడంతో మహమ్మద్ పహిల్వాన్ బయటకు రిలీజ్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులతో జీవితం గడుపుతున్నాడు. అయితే తెల్లవారుజామున తీవ్రమైన గుండె నొప్పి రావడంతో యశోద హాస్పిటల్ కి తీసుకు వచ్చారు.అక్కడ చికిత్స పొందుతూ మొహమ్మద్ పహిల్వాన్ మరణించాడు.

Tags:    

Similar News