విశాఖలో మెట్రో కోసం?

విశాఖలోని మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ ల రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొటేషన్లను పిలించేందుకు అమరావతి [more]

Update: 2020-02-07 11:39 GMT

విశాఖలోని మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ ల రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొటేషన్లను పిలించేందుకు అమరావతి మెట్రోరైల్ ఎండీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం కోసం కొత్త డీపీఆర్ లను రూపోందించేందుకు ప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది. డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్షియంకు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ , రైట్స్ , యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం,
మూడు కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణం కోసం డీపీఆర్ ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడర్న్ ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు మరో డీపీఆర్ ను సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.

Tags:    

Similar News