ఓలా డ్రైవర్ ఇంతకు తేగించాడా..?

Update: 2018-06-05 13:42 GMT

కస్టమర్ల డబ్బులపై దృష్టి పెట్టే క్యాబ్ సంస్థలు అందులో పదోవంతు కూడా వారి డ్రైవర్ల ప్రవర్తనపై పెట్టడం లేదు. ఇప్పటికే వివిధ క్యాబ్ సంస్థల డ్రైవర్లు ప్రయాణికులను నానా హింసలకు గురిచేసిన ఉదంతాలు వెలుగుచూడగా, తాజాగా బెంగళూరులోనూ ఇటువంటి సంఘటనే బయటకు వచ్చింది.

వివరాల్లోకెళ్తే... బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల యువత ఆర్కిటెక్ట్ గా పనిచేస్తోంది. గత శుక్రవారం తెల్లవారు జామున రెండు గంటలకు ముంబాయి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, కొంత దూరం వెళ్లగానే క్యాబ్ డ్రైవర్ వి.అరుణ్ వేరే రూట్ లోకి మళ్లించాడు. ఆమె ప్రశ్నించగా వేగంగా వెళ్లవచ్చని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపి యువతి వద్ద నుంచి ఫోన్ లాక్కున్నాడు. అరిస్తే తన స్నేహితులను పిలిపించి గ్యాంగ్ రేప్ చేస్తామని హెచ్చరించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బట్టలు విప్పాలని వేధించాడు. ఆమె తనను వదిలేయాలని కాళ్లావేళ్లా పడి, ఈ విషయం తాను ఎవరికీ చెప్పనని బతిమిలాడటంతో ఆ క్రూరుడు ఎయిర్ పోర్టు వద్ద వదిలేశారు. ఆమె ఫోటోలు వాట్సాప్ లో షేర్ చేశాడు. అయితే, అక్కడి నుంచి వెళ్లిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మూడు గంటల్లోనే డ్రైవర్ ను అరెస్టు చేశారు.

Similar News