నేడు నిర్ణయం.. లాక్ డౌన్ పొడిగింపు ఎప్పటివరకూ అంటే?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణించిన వారి సంఖ్య 12కు [more]

Update: 2020-04-11 02:29 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణించిన వారి సంఖ్య 12కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా వ్యాధి బారిన పడి చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారు 45 మంది ఉన్నారు. అయితే ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నియంత్రణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థిితి, వలస కూలీల వెతలు వంటి వాటిపై కేబినెట్ చర్చించనుంది. లాక్ డౌన్ ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు కూడా మే 1వ తేదీ వరకూ తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను పొడిగించాయి.

Tags:    

Similar News