ఆధార్ కలవరం ఒవైసీ ఆగ్రహం

ఆధార్ సంస్థ జారీచేసిన నోటీసులు ఇప్పుడు హైదరాబాదులో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయ నాయకులతోపాటు గా ప్రజాసంఘాలు మాటల తూటాలు పేలుతున్నాయి. 127 మందికి ఆధార్ సంస్థ [more]

Update: 2020-02-19 06:31 GMT

ఆధార్ సంస్థ జారీచేసిన నోటీసులు ఇప్పుడు హైదరాబాదులో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయ నాయకులతోపాటు గా ప్రజాసంఘాలు మాటల తూటాలు పేలుతున్నాయి. 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి . అయితే దీనికి సంబంధించి ఆధార్ సంస్థ ఎదుట హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్లను చూపించాలని నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రేపు ఆధార్ సంస్థ అధికారికంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నోటీసులు అందుకున్న వారంతా హాజరై తమ దగ్గరున్న ఒరిజినల్ సర్టిఫికెట్లను చూపాలని ఆదేశించింది. నోటీసులు తీసుకున్న వారంతా ఆధార్ సంస్థ ఎదుట హాజరు కాని పక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

నోటీసులతో….

ఆధార్ సంస్థ ఇచ్చిన నోటీసులతో హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే దీనిపై న్యాయపరంగా ఎదుర్కొంటామని నోటీసులు అందుకున్న వారు చెప్పారు. మరోవైపు నోటీసులు అందుకున్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమకూర్చుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతుందని, ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని పోలీస్ శాఖ కోరింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఆధార్ సంస్థ ఈ సమావేశాన్ని మే మాసానికి వాయిదా వేస్తూ ప్రకటించింది. ఇక్కడితో ఈ వివాదం ముగిసి పోలేదు. ఆధార్ సంస్థ జారీచేసిన నోటీసు పైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు 127 మందికి నోటీసులు ఇచ్చినట్లు పోలీసులకు ఎవరు చెప్పారని అసదుద్దీన్ ఒవైసీ చేసిన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News