హుజూర్ నగర్ బరిలో 119 మంది

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నికలో పోటీకి భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి, [more]

Update: 2019-09-30 11:58 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నికలో పోటీకి భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్ రావు, స్వత్రంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరో 115 మంది ఇండిపెండెంట్ట్లు గా నామినేషన్లు దాఖలు చేశారు. ఎల్లుండి ఉపసంహరణ తరువాత ఎంతమంది బరిలో ఉండే విషయం స్పష్టమవుతుంది. మాజీ సర్పంచ్ లు, విద్యార్థి నాయకులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాల నుంచి చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాదులో కేసీఆర్ కూతురు కవితను ఏ విధంగా ఓడించామో ఇక్కడ కూడా సైదిరెడ్డిని గెలువకుండా పోటీ చేస్తున్నట్లు ఇంతకుముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు ప్రకటించారు. ఈ నెల 21న ఎన్నికలు జరుగనున్నాయి.

 

 

Tags:    

Similar News