మోడీని ఢీకొట్టేందుకు రైతన్నల సై..!

నిజామాబాద్ రైతన్నలు మరో అనూహ్య నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు బ్యాలెట్ వార్ కు దిగిన రైతన్నలు ఇప్పుడు మరోసారి బ్యాలెట్ నే నమ్ముకున్నారు. [more]

Update: 2019-04-23 10:05 GMT

నిజామాబాద్ రైతన్నలు మరో అనూహ్య నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు బ్యాలెట్ వార్ కు దిగిన రైతన్నలు ఇప్పుడు మరోసారి బ్యాలెట్ నే నమ్ముకున్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, మద్దతు ధరలు కల్పించాలని చాలా రోజులుగా పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వాల నుంచి స్పందన లేకపోవడంతో నిజామాబాద్ ఎంపీగా ఏకంగా 176 మంది రైతులు పోటీ చేశారు. దీంతో 12 ఈవీఎంలతో ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఈ చర్య ద్వారా వారి సమస్యను దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. ఇప్పుడు మరోసారి ఇదే తరహా నిరసన తెలియజేయాలని రైతన్నలు భావిస్తున్నారు. ఈసారి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి పోటీ చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే నిజామాబాద్ రైతన్నల సమస్య దేశంలో చర్చనీయాంశం కావడం ఖాయం.

Tags:    

Similar News