బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసు మూడు వారాలు వాయిదా

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు మరో మూడు వారాల పాటు కేసును [more]

Update: 2020-07-08 08:16 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు మరో మూడు వారాల పాటు కేసును వాయిదా వేసింది. ఈ కేసులో మరింత మందిని విచారించాల్సి ఉందని, అందుకే మూడు వారాలు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానంతెలిపింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో మూడు వారాల పాటు సందిగ్దత నెలకొంది. హైకోర్టు ఆదేశాలిచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఇంతవరకూ నియమితులు కాలేదు. ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Tags:    

Similar News