నిమ్మగడ్డలో ఆశలు చిగురిస్తున్నాయా?

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆశలు చిగురిస్తున్నాయి. ఈరోజు రమేష్ కుమార్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ ఉంది. అయితే నిన్న [more]

Update: 2020-05-05 02:21 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆశలు చిగురిస్తున్నాయి. ఈరోజు రమేష్ కుమార్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ ఉంది. అయితే నిన్న జరిగిన విచారణలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు నిమ్మగడ్డలో ధైర్యాన్ని నింపాయని అంటున్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో చేసిన సవరణలు, మున్సిపల్ చట్టంలో చేయకపోవడంపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. మున్సిపల్ చట్టంలో ప్రభుత్వం సవరణలు చేయలేదు కాబట్టి ఐదేళ్ల పదవీ కాలం ఉన్నట్లే కదా? అని హైకోర్టు ప్రశ్నించడాన్ని నిమ్మగడ్డ తరుపు న్యాయవాదులు తమకు అనుకూలమైన వ్యాఖ్యలేనని భావిస్తున్నారు. మున్సిపల్ చట్టంలో ఉన్న నియమ నిబంధనలు వివరించాలని కోరింది. నేడు మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై విచారణ జరగనుంది.

Tags:    

Similar News