బ్రేకింగ్ : నిమ్మగడ్డ కౌంటర్ ఇదే

మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిప్లై పిటషన్ కొద్దిసేపటి క్రిత దాఖలు చేశారు. మొత్తం 17 పేజీలతో పిటీషన్ కోర్టుకు సమర్పించారు. కోర్టుకు [more]

Update: 2020-04-27 07:01 GMT

మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిప్లై పిటషన్ కొద్దిసేపటి క్రిత దాఖలు చేశారు. మొత్తం 17 పేజీలతో పిటీషన్ కోర్టుకు సమర్పించారు. కోర్టుకు అఫడవిట్ సమర్పించారు. ఎన్నికల షెడ్యూల్ ను కుదిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్డినెన్స్ పేరుతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదనడానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ లు ఎక్కువగా ఏకగ్రీవం కావడంతో పాటు హింసాత్మక ఘటనలు ఉదాహరణ అని నిమ్మగడ్డ తన పిటీషన్ లో పేర్కొన్నారు. తాను రాష‌్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ దృష్ఠికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించవచ్చేమో కాని, కొనసాగుతున్న కమిషనర్ కు వర్తించదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News