హత్యాయత్నం కేసులో స్పీడ్ పెంచిన ఎన్ఐఏ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా నిందితుడు శ్రీనివాసరావును విజయవాడకు తరలించారు. విజయవాడ [more]

Update: 2019-01-11 05:34 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా నిందితుడు శ్రీనివాసరావును విజయవాడకు తరలించారు. విజయవాడ కోర్టులో అతడిని హాజరుపరిచిన అనంతరం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. శ్రీనివాసరావును విచారించడం ద్వారా అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను కోరింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేనందున కేసు డాక్యుమెంట్లు అప్పగించేందుకు పోలీసులు నిరాకరించడంతో ఎన్ఐఏ కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ కేసును ఎన్ఐఏ విచారణకు స్వీకరించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News