డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. ఆ 300 మంది?

డ్రగ్స్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు విద్యార్థుల డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గా ఖచ్చితమైన సమాచారం ఉంది . [more]

Update: 2020-06-04 05:42 GMT

డ్రగ్స్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు విద్యార్థుల డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గా ఖచ్చితమైన సమాచారం ఉంది . ఈ మేరకు రెండు రోజుల క్రితం ఇద్దరిని అరెస్టు చేయడంతో విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్ డౌన్ లో డ్రగ్స్ తీసుకోని వాళ్ళు ఇప్పుడు సడలింపు సమయంలో డ్రగ్స్ తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ తీసుకున్న మూడు వందల మంది ఎవరనేది ఇప్పుడు సంచలనంగా మారింది . అయితే గత కొంత కాలం నుంచి తీసుకున్న 300 మంది తిరిగి డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం ఇద్దరి అరెస్ట్ తో…..

2 రోజుల క్రితం డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతిక పరంగా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీళ్ళు కొన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా వాట్సాప్, టెలిగ్రామ్ లో చేసిన చాటింగ్ లను ఎప్పటికప్పుడు డిలీట్ చేశారు. దీంతోపాటుగా కాల్ లిస్ట్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు . అధికారులు పట్టుకుని వెంటనే ఫోన్ ని సీజ్ చేశారు. దాంట్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్ లో చాటింగ్ ను చూసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే చాటింగ్ మొత్తం కూడా డిలీట్ కావడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో టెక్నికల్ సపోర్టింగ్ కోసం పోలీసు అధికారులను ఆశ్రయించారు. వాట్సాప్, టెలిగ్రామ్ తో పాటు పూర్తిగా చేసి ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించి కొంత సమయం పడుతుందని పోలీస్ అధికారులు అధికారులకు వెల్లడించారు. అయితే ఏది ఏమైనప్పటికీ 300 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అధికారులు వద్దకు చేరింది. ప్రధానంగా సినీ ప్రముఖులతో పాటు వ్యాపార వేత్తలు, విద్యార్థులు ఈ మేరకు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కొంత సమాచారం . దీనికి సంబధించి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో అధికారులు పడ్డారు. .

Tags:    

Similar News