కర్ణాటకలో కొత్తజాతికి చెందిన పీత గుర్తింపు..75వ పీత జాతిగా గుర్తింపు

డ్యూయల్-టోన్ కలిగిన ఈ పీత పశ్చిమ కనుమలలోని రాతి క్రస్ట్‌లో నీటి వనరుల మధ్య జీవిస్తుంటుందని తెలిపారు. ఇది అత్యంత ప్రత్యేకమైన..

Update: 2022-08-19 12:48 GMT

కర్ణాటకలో అరుదైన పీతను గుర్తించారు. ఇదో కొత్తజాతికి చెందిన పీత అని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండు రంగుల్లో చూడముచ్చటగా ఉన్న ఈ పీత 3 అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉంది. సాధారణ పీతలకంటే భిన్నంగా కనిపిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించిన ఈ పీతకు 'ద్వివర్ణ (Dwivarna)' అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. ఇటీవలే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోగా.. ఆగస్టు 15వ తేదీనే ఈ పీతను గుర్తించడం, అదీ 75వ జాతికి చెందినది కావడం విశేషం.

2021 జూన్ 30న భారే అడవుల గుండా ప్రయాణిస్తున్న ఎల్లాపూర్ సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గోపాల్ కృష్ణ హెగ్డే, కద్రా ఫారెస్ట్ గార్డ్ పరశురాం భజంత్రీలు రంగు రంగుల్లో ఉండి ఆకట్టుకున్న ఈ పీతను కనుగొన్నారు. ఇది చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. పీత గురించి శాస్త్రవేత్తలకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఏడాది తర్వాత పీతకు ఘటియానా ద్వివర్ణ అని పేరు పెట్టారు. అయితే ఇవి తినదగినవి కాదని చెప్తున్నారు.
డ్యూయల్-టోన్ కలిగిన ఈ పీత పశ్చిమ కనుమలలోని రాతి క్రస్ట్‌లో నీటి వనరుల మధ్య జీవిస్తుంటుందని తెలిపారు. ఇది అత్యంత ప్రత్యేకమైన పీతలలో ఒకటని హెగ్డే అన్నారు. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీనిని ఒక ప్రత్యేకమైన జాతిగా నిర్ధారించింది. దాంతో హెగ్డే, భజంత్రీలకు 'సిటిజన్ సైంటిస్ట్స్' అనే బిరుదు లభించింది.


Tags:    

Similar News