గతం మర్చిపోతాం... కలిసి పనిచేస్తాం

Update: 2018-11-01 11:39 GMT

దేశాన్ని, ప్రజస్వామ్యాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీతో కలిసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాహుల్ నివాసంలో ఇరువురు భేటీ గంటకు పైగా సాగింది. అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడుదాం... ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ముందుకు పోనున్నట్లు తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యవస్థలను ఇలా నాశనం చేయడం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఆర్బీఐ, సీబీఐ సహా అన్ని వ్యవస్థలను కేంద్రం విధ్వంసం చేసిందన్నారు. దేశాన్ని కాపాడటం కోసం గతాన్ని మరిచిపోయి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని, బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకం చేస్తామని పేర్కొన్నారు.

దేశ భవిష్యత్ కోసమే...

పాత విషయాల జోలికి వెళ్లాలనుకోవడం లేదని, దేశాన్ని కాపాడటం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలోని వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాఫేల్ కుంభకోణం, రైతుల సమస్యలు, వ్యవస్థల విధ్వంసమే తమ ప్రచారస్త్రాలు అని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.

Similar News