తెలుగులో మాట్లాడిన మోదీ.. గురజాడ అప్పారావు?

కరోనా వ్యాక్సినేషన్ ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇంత పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. వ్యాక్సినేషన్ ను వేయించుకున్నామని అజాగ్రత్త వహించవద్దని [more]

Update: 2021-01-16 05:42 GMT

కరోనా వ్యాక్సినేషన్ ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇంత పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. వ్యాక్సినేషన్ ను వేయించుకున్నామని అజాగ్రత్త వహించవద్దని తెలిపారు. ఇతర దేశాలతోపోలిస్తే కరోనా టీకా తక్కువ ధరకు అందించగలుగుతున్నామని, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని మోదీ తెలపిారు. కరోనాతో ఏడాది పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. తక్కువ సమయంలోనే కరోనా తీసుకువచ్చిన మన శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. తొలుత ఆరోగ్యసిబ్బందికి, ఆ తర్వాత పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలు వేస్తామన్నారు. అనంతరం సైనికులకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు మోదీ వివరించారు. టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. దీనిపై దుష్ప్రచారం చేయవద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. తొలినాళ్లలో మాస్క్ లు, పీపీఈ కిట్ల కోసం కూడా ఇతర దేశాలపై ఆధారపడ్డామని, ఇప్పుడు వ్యాక్సినేషన్ ను మనమే తయారుచేసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను గుర్తుచేశారు. సొంత లాభం కొంత మానుకుని, పొరుగువారికి తోడ్పడవోయ్.. దేశమంటే మట్టికాదు దేశమంటే మనుషులోయ్ అన్న సూక్తిని మోదీ తెలుగులో వివరించారు. గురజాడ మాటను దేశవ్యాప్తంగా పాటించాలని మోదీ కోరారు.

Tags:    

Similar News