బ్రేకింగ్ : నారాయణ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. రాజధాని భూముల వ్యవహారంలో నారాయణను విచారించాలని సీఐడీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అప్పటి సీఆర్డీఏ మాజీ కమిషనర్ [more]

Update: 2021-07-04 04:38 GMT

మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. రాజధాని భూముల వ్యవహారంలో నారాయణను విచారించాలని సీఐడీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అప్పటి సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సీఐడీ అధికారుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల మాయంపై చెరుకూరి శ్రీధర్ ను సీఐడీ అధికారులు విచారించారు. ల్యాండ్ పూలింగ్ కు ముందే 2014లో తుళ్లూరు రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారని చెరుకూరి శ్రీధర్ తెలిపారు. 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభమయిందని వెల్లడించారు. అప్పటి మంత్రి నారాయణ ఆదేశాలతోనే జరిగిదని చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. అసైన్డ్ భూముల విష‍యంలోనూ జీవో నెంబరు 41ను తేవడం చట్టవిరుద్ధమని చెప్పినా నారాయణ విన్పించుకోలేదని చెరుకూరి శ్రీధర్ సీఐడీ అధికారులకు తెలిపారు. దీంతో నారాయణను విచారించేందుకు సీఐడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News