బ్రేకింగ్ : నారా లోకేష్ అరెస్ట్

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ ను విజయవాడ బెంజి సర్కిల్ వద్ద అరెస్ట్ చేశారు. రైతు దీక్షా [more]

Update: 2020-01-07 08:22 GMT

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ ను విజయవాడ బెంజి సర్కిల్ వద్ద అరెస్ట్ చేశారు. రైతు దీక్షా శిబిరంలో పాల్గొనేందుకు, ఏడో నెంబరు జాతీయ రహదారి పై ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళుతున్న నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు కూడా అరెస్ట్ అయ్యారు. నారా లోకేష్ ను తోట్ల వల్లూరు వైైపు తీసుకెళుతున్నారు. ముందస్తు అరెస్ట్ ల్లో భాగంగానే లోకేష్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News