జగన్ పై నారా లోకేష్ సెటైర్లు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. జగన్ గృహప్రవేశం, రైల్వే జోన్ అంశాలపై జగన్ ను విమర్శిస్తూ [more]

Update: 2019-02-28 09:46 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. జగన్ గృహప్రవేశం, రైల్వే జోన్ అంశాలపై జగన్ ను విమర్శిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. జగన్ ను జగన్ మోడీ రెడ్డి అని సంభోదించి గృహప్రవేశం చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. భ్రమరావతి అన్న జగన్ నాలుగేళ్ల 10 నెలల తర్వాత అమరావతికి వచ్చి ఒక్క రోజు కూడా ఉండకుండా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ గృహప్రవేశానికి కానుకగా మోడీ రైల్వే జోన్ ఇచ్చారని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ గృహప్రవేశం సందర్భంగా ఏడాదికి రూ.6,500 కోట్ల ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ ను మోడీ ఒడిశాకు కానుకగా ఇచ్చి రాష్ట్రానికి అన్యాయం చేశారని, మోడీతో జోడి కట్టి జగన్ రైల్వేజోన్ కుట్రలో భాగమయ్యారని ఆరోపించారు.

Tags:    

Similar News