కేసీఆర్ చతికిలపడ్డారు… నారా లోకేష్ ఎద్దేవా

ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ కేసీఆర్, ఆంధ్రా మోడీ జగన్ కు కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబు ఓటమి [more]

Update: 2019-02-23 14:14 GMT

ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ కేసీఆర్, ఆంధ్రా మోడీ జగన్ కు కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబు ఓటమి ఖాయమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ వరుస ట్వీట్లతో మండిపడ్డారు. ఒక్క చంద్రబాబును ఎదురుకోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమంలో ఏపీతో పోటీ పడలేక, జగన్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే ప్రణాళికలతో టీఆర్ఎస్ ఉందని కేటీఆర్ మాటలతో తేలిపోయిందన్నారు. టీడీపీ ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్, ఆయన సహచరులకు భంగపాటు తప్పదని, ఇది తథ్యమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జతకట్టిన కేసీఆర్ తెలంగాణకే పరిమితమై చతికిలపడ్డారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News